శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
299. నాదరూపా | ||
ఓం కార రూపము. నాదము ఉన్నచోట రూపము వున్నది. నాదము వున్న చోట శక్తి వున్నది. ప్రతి అణువులో నాదము వున్నది. ఈశ్వరుడు వున్నచోట శక్తి తప్పకుండా వుంటుంది. ఓం కార అనగా, శక్తి గాయత్రీస్వరూపము, ప్రాణంగాయత్రీ. అంటే చలించే ప్రతి దాంట్లో నాదము వున్నది.ఈ సృష్టి అంతయూ నాదప్రపంచమే. నాదము లేనిచోట జీవము లేదు, ప్రాణము లేదు. వేద, నాద, సంకీర్తన స్వరూపము అఖిలాండకోటి బ్రహ్మండ నాయిక, రాజరాజేశ్వరి,లలితా పరమేశ్వరి. నీకు ప్రణామాలు 🙏 🌺 మనిషి మధ్య సంభాషణ నాదము ద్వారా, అనగా వాక్కు ద్వారా వ్యక్తపరుస్తాము. మనము మాట్లాడే ప్రతి మాట శుభసుచణముగా వుండాలి అని ప్రయత్నిస్తాము.🌺 |