శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
240. చంద్రమండలమధ్యగా | ||
శ్రీచక్రములోని మధ్యభిందువే చంద్రమండల. శ్రీచక్రములో అంతరత్రికోణములో వున్న కేంద్రబిందువే జగజ్జనని. అక్కడినుండే వెలుగు వ్యాపించి మన యందు చైతన్యముగా, ప్రాణముగా,, జ్ఞానముగా, విజ్ఞానము, ప్రజ్ఞానముగా వెలుగొందుతూ వున్నది. శ్రీచక్రములోని మధ్య బిందువుగా తేజరిళ్లుతున్న తల్లికి నమస్కారమ🙏 🌺 మానవ శరీరమే శ్రీచక్ర రూపము. అందులో సహస్రారము దెగ్గర ఆ తల్లీ స్థానము. ధ్యాన సాధన ద్వారా, మనలో కొత్త చైతన్యము ప్రవేశించి, జ్ఞ్యాన బుద్ధిని ప్రసాదిస్తుంది.🌺 |