శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
253. విజ్ఞానఘనరూపిణీ | ||
వాక దేవతా. జ్ఞాన, ప్రజ్ఞాన, విజ్ఞాన, అజ్ఞానములు అన్నియూ ఆ పరాశక్తి స్వరూపమే. 8 అక్షరములు వున్న ఈ నామము విజ్ఞాన :విజ్ఞానము, ఘన: స్థిరత్వము, రూపిణి :రూపము కలది. శ్రీవిద్యది దేవత అయిన ఆ జగజ్జనని సకల విద్యా స్వరూపిణి.ఆ తల్లీ చేతనా శక్తి స్వరూపిణి. లలితా స్వరూపిణి విశ్వమాతా, జ్ఞానదా,జ్ఞానవిగ్రహ,జ్ఞానముద్ర,జ్ఞానగమ్య, జ్ఞానజ్ఞేయస్వరూపిణి. అఖండ ఆనంతమైన మహాత్బుతమే విజ్ఞానఘనరూపిణి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺జ్ఞాన సంపద అన్నది అందరికి పంచుతే, అది ఇంకా పెరుగుతుంది. "భోదయంతః పరస్పరం " అన్న ఈ సూక్తిని పాటించాలి. మనకి తెలిసిన మంచి విషయాలు నాలుగురితో పంచుకోవాలి. ఇతరులకు తెలిసిన విషయాలు కూడా మనము విని తెలుసుకోవాలి. తత్తద్వారా మన జ్ఞాన నిధి అభివృద్ధి చెందుతుంది.🌺 |