శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
294. భువనేశ్వరీ | ||
పదునాల్గు భువనములకు ఈశ్వరీ కాబట్టి ఆమెయే భువనేశ్వరి. సృష్టి ప్రధాయిని అయినటువంటి జగన్మాతయే, సకల లోకమును రక్షించును. ఆమె రూపమే భువనము కాబట్టి ఆమె గర్భమునందే అంతయూ దాగివున్నది. అందులకే ఆమె భువనేశ్వరి. చతుర్దషభువనాలకు ఈశ్వరీ ఐనా తల్లికి నమస్కారము 🙏 🌺 మానవుడి భువనము, తను వుండే గృహము. తన గృహములో సకల ఐశ్వర్యము వుండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకునేది. ఆ తల్లియొక్క అనుగ్రహముతో, పూర్ణత్వ భావనతో ఆది సాధ్యము కాగలదు.🌺 |