శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
245. చక్రరాజ నికేతనా | ||
శ్రీచక్రమున నివసించునది. శ్రీదేవి శ్రీచక్రమున నివసించుకారణము చేత, శ్రీచక్రానికి పవిత్రత ఏర్పడినది. మన దేహమే శ్రీచక్రము. మన దేహములోని పవిత్రతను బట్టి ఆ పరాశక్తి నివసించి వుండును. శ్రీచక్రాన్నీ నివాసముగా చేసుకున్న తల్లికి నమస్కారము 🙏 🌺మనలోని పవిత్రత భావనను బట్టి, ఆ తల్లీ మనలో నివాసమును స్థిరపరుచుకుంటుంది. నిత్య సాధన ప్రక్రియతో, ఆ పరాశక్తి నామ స్మరణతో,పవిత్రభావన ఏర్పడుతుంది.🌺 |