శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
259. తైజసాత్మికా | ||
స్వప్నావస్థను కలిగివున్నటివంటి జీవునకు తేజసుడు అని పేరు. కారణ దేహమునందు చూచే వెలుగునకు తేజ సాత్మికా, తైజస అని పేరు. తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి. ఈ జగత్తు అంతా మహా మాయా స్వరూపిణి యొక్క లీలా విలాసమే. తేజ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము 🙏 🌺మనము నమ్మిన ఆ తల్లీ లీలలు, కళలు రూపేణ మనకి దృశమవుతాయి. మనకి మార్గదర్శకత్వం వహిస్తాయి.🌺 |