శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
285. ఆబ్రహ్మకీటజనని | ||
బ్రహ్మము నుండి కీటకమువరకు తానే వుంది. ఈ సృష్టిలో వున్న అన్నియూ ఆమె సృష్టించినదే. మన ధర్మ ప్రవుత్తిని బట్టి మరు జనమలో మన పుట్టుక వుంటుంది . చివరి శ్వాస లో ఏ భావనతో, ఆలోచనతో,శ్వాశ విడుస్తామో మరు జన్మ లో అదే జన్మ లభిస్తుంది. ఈ జన్మలో చేసిన కర్మనీ బట్టి మన మరు జన్మ నిర్ధారించబడుతుంది. అందుకే అహర్నిశలు రామ నామ జపము చేస్తువుంటే ఆ రాముడే మనకి ధర్మబద్దంగా వున్న దారిని చూపిస్తాడు🙏 🌺శాస్త్రలను గౌరవించడం, వాటిని చదవడము / వినడము, శాస్త్రములో చెప్పినవి పాటించడం వల్లన సతగతులు ప్రాప్తిస్తాయి.🌺 |