అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.
చతుషష్టి ఉపచారాలు అంటే 64 ఉపచారములు అని అర్థం. అవి : 1.ధ్యానం, 2.దివ్యమందిరం, 3.రత్నమంటపం, 4. ఆందోళికం, 5. ఆవాహనం, 6. సింహాసనం, 7.వితానం, 8.పాద్యం, 9.అర్ఘ్యం, 10. ఆచమనం, 11. మధుపర్కం, 12. అభ్యంగనం, 13. ఉద్వర్తనం, 14. పంచామృత స్నానం, 15. శుదోదక స్నానం, 16.వస్త్రం, 17.ఉత్తరీయం, 18.దివ్యపాదుకం, 19.కేశపాశ బంధనం, 20.సౌవీరాంజనం, 21. ఆభరణం, 22.శ్రీగంధం, 23. అక్షతలు, 24.హరిద్రాచూర్ణం, 25.కుంకుమ విలేపనం, 26.సుగంధ ద్రవ్యం, 27. సిందూరం, 28.పుష్పం, 29. ధూపం, 30.దీపం, 31.కుంభార్తిక్యం, 32. నైవేద్యం, 33.హస్త ప్రక్షాళనం, 34.పానీయం, 35.ఫలం, 36.తాంబూలం, 37.సువర్ణపుష్ప దక్షిణ, 38. ఛత్రం, 39. చామరం, 40.దర్పణం, 41. నీరాజనం, 42.దివ్యమంత్ర పుష్పం, 43. ప్రదక్షిణం, 44. నమస్కారం, 45.తురంగ వాహనం, 46. గజవాహనం, 47. దివ్యరథం, 48. చతురంగ సైన్యం, 49.దుర్గం, 50.వ్యజనం, 51. ధృక్పానపాత్ర నటనం, 52.నాట్యం, 53.మృదంగ వాద్యం , 54. గంధర్వ కన్యాగానం, 55.వివిధవాద్య శ్రవణం, 56.క్షమాపణం, 57. భక్త గృహ నివాసనం, 58.సువర్ణ పర్యంకోపవేశనం, 59. లాక్షారంజనం, 60. గండూష జలపాత్రం, 61. సుఖశయనం, 62. ప్రార్ధనం, 63.హృదయ నిత్యనివాసం, 64. పూజాఫలం.
ఈ 64 రకాల ఉపచారాలని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు లోకానికి అందించారు.
అత్యంత విశిష్టమైన ఈ ఉపచారాలతో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిని అర్చించి ఆ దేవి అనుగ్రహాన్ని అందరం పొందుదాం.🙏
🌺64 ఉపచారములు అందుకున్న ఆ తల్లీ మన ఇంట స్థిర నివాసమై వుంటుంది.🌺
|