శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
203. సర్వమయి | ||
సమస్త లోకమునందు వ్యాపించి వున్నది. పంచాభూతములు మొదలు పరమ శివుని వరకు గల అన్ని తత్వములు ఆ దేవి యుక్క స్వరూపములే. సర్వ చైతన్యము తానే అయివున్నది, కావున సర్వమయి. అనగా పరదేవతగా మూలప్రకృతి స్వరూపిణి. అంతటా వ్యాపించి వున్న ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మానవ జీవితం మనకి ప్రాప్తించ్చినందుకు, ఈ సృష్టి మొదలు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అన్న జ్ఞానం మనకి బోధ పడుతుంది. ఆ ప్రయత్నన్ని మొదలుపెడతాము 🌺 |