శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
291. పురుషార్ధప్రదా | ||
పురుషార్ధాలు ప్రసాదించునది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్న ఈ చతురవిధములను ప్రసాదించును ఆ శ్రీదేవి, కనుక ఈ నామము పురుషార్ధప్రదయిని అని స్థుతించు చున్నాము. జీవుడు తన కర్మలు ధర్మ బద్దముగా నిర్వర్థిస్తూ, మొక్షమును పొందడానికి ఆ జగజ్జనని ఆశ్రయిస్తాడు. చతురవిధములను ప్రసాదించే తల్లికి నమస్కారము 🙏 🌺మన జీవన విధానము ధర్మముతో,అర్దముతో, కామముతో, మోక్షనికై ముడి పడి వున్నాది అన్న సత్యాన్ని తెలుసుకుంటాము. దానికి కావలసిన క్రమపద్దతులను అలవాటు చేసుకుంటాము.🌺 |