శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
233. మహాకమేశ మహిషీ | ||
ఈశ్వరుడే కాముడు.అందుకే మహాకమేశ్వరుడు అయ్యాడు. మహాకమేశ మహిషీ అనగా పరానాద స్వరూపిణి, ఈం కారస్వరూపిణియైన పరాశక్తి అని అర్ధం. ఈశ్వరశక్తి,మహాకమేశునీయొక్క పట్టమహీషి. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనకి కలిగే సంకల్పము ఈశ్వర రూపము. ఆ సంకల్పము సిద్ధించడం శక్తి రూపము. అందుకే ఏ ధర్మ సంకల్పము తలపెట్టినా ఈశ్వరశక్తి మనకి అండగా వుంటుంది.🌺 |