శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
260. సుప్తా | ||
సుప్తా అంటే సుషప్తావస్థ రూపము. అంటే గాఢ నిద్రలో వున్న వారికి, యిహమును మరిచి, తనకి వున్న కష్టాలు, సుఖాలు అన్నియూ మరిచి ఎలా వుంటాడో, అదియే సుప్తా వస్థ. ఆనంద స్వరూపిణి. దీనికి అతీతముగా వున్నది ఆ తల్లీ. జీవులలో కలుగు ఈ అవస్థలో కూడా తానై వున్నది ఆ పరాశక్తి . ఆ తల్లీకి నమస్కారము 🙏 🌺మన లక్ష్యం కొసమే ధ్యానిస్తున్నప్పుడు, బయట ప్రపంచంతో భవ బంధాలు లేకుండా వుంటాము 🌺 |