శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
267. గోవిందరూపిణీ | ||
గో అనగా సమస్త దేవతల యొక్క రూపము. గోవులను ప్రేమించే హరి, వాచస్పత్తి, శ్రీమహవిష్ణువు యొక్క రూపము. గో రూపిణి అనగా గాయత్రీ రూపము.శుద్ధ తేజేసు రూపిణి. మరియుక్క అర్ధము ఏమీ అంటే,.. గో అనగా గోకులం, గోకులానికి రాధా దేవి అధిష్టాన దేవత. భక్తి, ప్రేమ స్వరూపము. ఆమెయే గోవిందా స్వరూపిణి. సర్వమూ తానై వున్నది కాబట్టి ఆమె గోవిందా రూపిణి. వేదాంత జ్ఞానము యొక్క వెలుగే, గోవిందస్వరూపిణి. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ప్రేమ, భక్తి, వత్సల్యము, అనురాగము,... వంటి గో సాత్విక లక్షణాలు మనలో ఒక ప్రత్యేకత గుర్తింపుని తెస్తాయి.🌺 |