శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
254. ధ్యానధ్యాత్రధ్యేయరూపా | ||
త్రిపుటి స్వరూపిణి. ధ్యానము సంకల్పము, ధ్యానము చేయడము, ధ్యానము యొక్క ధ్యేయము. ఈ మూడింటి స్వరూపమే పరమేశ్వరి. మౌనముగా ఉపాసన చేయటమే ధ్యానము. ధ్యాత్ర అనగా ధ్యాన చేయు కర్త. ధ్యాన యొక్క పరిపక్వతయే ధ్యేయ.ఈ మూడు ఏకమైపోతే, లయమైపోతే, అట్టి స్థితియే ధ్యాన ధ్యాత్ర ధ్యేయ. ఈ స్థితిలో వున్న పరంజ్యోతికి నమస్కారము 🙏 🌺మన లక్ష్య సాధన కొరక ధ్యాన ధ్యాత్ర ధ్యేయ స్థితి గా ప్రయత్నము చేస్తే, మనకి లక్ష్య సాధన ఫలితం తథ్యం లభిస్తుంది.🌺 |