శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
231. మహాభైరవ పూజితా | ||
మహా భైరవుడిచే పూజింపబడినది. భైరవుడు అంటే ఈశ్వరుడి అంశమే. సృష్టి, స్థితి, లయకారకుడు అయినా పరామశివుడి రూపము. భైరవ శబ్దమందున్న 'భ, ర, వ ' అక్షరములు భరణ అంటే సృష్టి , రవణ అంటే స్థితి , వమనము అంటే లయకారకుడు. విశ్వప్రాణి శక్తియే మహాభైరవ.ఈ మహాభైరవుడు ఆజ్ఞ లేనిదే గ్రహ, నక్షత్ర, తారకాకోటులేకాదు, ప్రపంచములో నామరూప పదార్ధమెదియూ కదలదు. దానికి కారణమైన దేవతలు కూడా కదలలేరు. అంటే కార్యకరణములకు రెండింటికినీ అధిష్టానమే కాక పరతత్త్వమైనదేదో అదియే మహాభైరవ. అట్టి ఆ భైరవుడిచే పూజింపబడే తల్లికి నమస్కారము 🙏 🌺చేసే ప్రతి పనిలో పవిత్రత భావన, క్రమంపద్దతి, నిజాయితీ, శ్రద్ధ వుంటే, మనవేంట ఆ భైరవుడు రక్షకుడిగా నిలుస్తాడు. రక్షిస్తాడు 🌺 |