శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
263. సర్వావస్థా వివర్జితా | ||
అన్ని అవస్థలు అంటే జాగ్రత, స్వప్న, సుషుప్తి, తుర్యా వంటి అన్ని అవస్థలను విడిచినది. భావ శూన్యమైన తుర్యాతీతావస్థ. అవస్థారహిత స్వరూపము. మానవుడు అట్టి బ్రహ్మశీర్షమును చేరినప్పుడు, ఆ తల్లీ సర్వావస్థా వివర్జితముగా మానవ శరీరమును మారుస్తుంది. శరీరమాంతయూ కాంతితో వెలుగుతుంది. అట్టి మహనీయుల పాదములను స్పృశించినా, దర్శిచినా మన జీవితము ధన్యము. వారు పలికిన మాట మంత్రము, వారు కాలు పెట్టిన చోట పుణ్య క్షేత్రం. అటువంటి వారు శక్షాత శ్రీదేవి స్వరూపులు, పరంజ్యోతి స్వరూపులు. కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, ఆ స్థితిని పొందిన వారు. ఆ స్థితిలో వున్న పరాశక్తికి నమస్కారము 🙏. 🌺ఆ పరాశక్తి వున్నది అని నమ్మినవారు, మనము చేపట్టిన లక్ష్యాన్ని తన లక్ష్యం గా మర్చి, మనల్లీ నడిపిస్తుంది. విజయాన్ని ఇస్తుంది.🌺 |