శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
220. మహేశ్వర్యా | ||
అష్టైశ్వర్యం కలిగి వున్నది. ఈశ్వరుడి ఐశ్వర్యం. సకల సంపద ఇచ్చే దేవి, మహేశ్వరీ. సర్వారుణ స్వరూపిణియైన శ్రీచక్రబిందు నివాసిని. తన భక్తులకు సకల సంపదను ఇచ్చే తల్లికి నమస్కారము 🙏. 🌺 అష్టైశ్వర్యం తో పాటు, జ్ఞాన సంపద పెరిగేనే. ఈ జ్ఞానం దిన దిన అభివృద్ధి చెందేను. ఈ సంపదను ఎవ్వరు దొంగలించలేరు.🌺 |