శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
281. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి: | ||
కనురెప్పలలు తెరిచినంత సమయములో సమస్త భువనాన్ని సృష్టించి, మరల ముసిన సమయములో, ఈ సమస్త భూమoడలాన్ని తనలో లయము చేసుకుంటుంది. ఉన్మేషము అనగా కనురెప్పలు తెరుచుట , నీమీషము అనగా కనురెప్పలు మూయుట. ఉత్పన్న అంటే పుట్టిన, విపన్న అంటే లాయముపొందిన. భువనావళి: అంటే సమస్త భూమండలము. ఒక్క రెప్పపాటులో అనంత కాలము వెళ్ళిపోతుంది, మరల సృష్టించబడుతుంది. దీనికి అధిష్టాత్రీ లలితపరమేశ్వరి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺కనురెప్ప పాటు సమయమును కూడా వృధా కాకుండా వుండడానికి ప్రయత్నము మొదలుపెడుతాము 🌺 |