శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
219. మహాభోగా | ||
ఏ సుఖమైనను , జ్ఞానమైనను భోగము అని అనుదురు. అన్ని సుఖములు/ భోగములు ఆ పరమేశ్వరి అధీనములో వుంటాయి. కాబట్టి ఆమె మహాభోగా. అఖండమైన జ్ఞాన సంపదను కలిగి వుండుట. ఆ జ్ఞాన సంపద ఎప్పటికి తరగనిది. భోగము అంటే అధిక సుఖము.అంటే శరీరముతో అనుభవించేవి కొన్ని, మనస్సుతో అనుభవించేవి కొన్ని. మనస్సుతో అనుభవించే ఆత్మ పరమాత్మ సంబంధం కలగిన వారు మహాయోగిశ్వరులు,మహా భోగ రసికులు అంటారు. శరీరముతో అనుభవించే భోగము శాశ్వతం కావు. ఎందుకు అంటే ఈ మానవ శరీరము శాశ్వతము కాదు కాబట్టి. అట్టి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారము 🙏 🌺 నేను ఎవరు, పరమాత్మ ఎవరు, అన్న ఆసెక్తి కలిగి, ఆ పరిశోధన లో అనంత భోగాన్ని అనుభవిస్తాము 🌺 |