శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
206. సర్వతంత్రరూపా | ||
తంత్రము అంటే క్రియ శక్తి,, యంత్రము జ్ఞాన శక్తి, మంత్రము అంటే ఇచ్చాశక్తి. ఈ మూడు ఆ పరాశక్తి యుక్క స్వరూపములే. తంత్రము యుక్క సూక్ష్మాము మంత్రము. మంత్రము చేత యంత్రములో తేజోశక్తి ఏర్పడుతుంది. సర్వ తంత్రములు ఆ తల్లీవే . అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో వుండే ఇచ్చా శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడిటిని మన జీవన విధానంలో, ధర్మ పరంగా, క్రమభద్ధంగా నడిపించే ప్రయత్నం చెయ్యగలుగుతాము 🌺 |