శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
211. మృడప్రియా | ||
మృడ అంటే శివుడు అని ఒక అర్ధం, మరొక్క అర్ధం ఆనందము. ఆ ఆనంద స్వరూపానికి ప్రియ మైనది. మనలో ఆనందం పొందడానికి ఆ తల్లీయే కారకురాలు. సకల ఆనందానికి స్వరూపిణి. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏. 🌺మనము నిర్వతించాల్సిన ప్రతి పని లో ఆ తల్లీ వున్నది అని భావన చేస్తే, మానసిక ఆనందాన్ని ఎంతగానో పొందుతాము, అనుభవిస్తాము.🌺 |