శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
222. మహాబలా | ||
అతి బలశాలి. త్రిమూర్తులకు సృష్టిని నిర్వహించుటకై ఇచ్చును బలము ఆ మహాత్రిపుర సుందరి. ఆమెయే మహాబలా. మహబల అంటే మహామాయ కంటే బలమైన క్రియాశక్తి. ఆమెయుక్క మాయను ఎవ్వరు దాటలేరు. నిరంతరమూ ఆ తల్లీ సేవలో వున్న వారికి మాత్రం మాయని తొలగిస్తుంది. అట్టి ఆ తల్లీకి నమస్కారము 🙏 🌺మన ఈ నిత్య హడావిడి జీవితంలో, ఎటువంటి నిశ్రాన అనిపించినప్పుడు, ఆ దివ్య శక్తి స్వరూపిణిని తలచుకొని , అమ్మ నామము జపిస్తే, తక్షణమే మనకి శక్తిని, బలాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లీ. ఇది ముమాటికీ నిజం. అందరమూ ఆ తల్లీ సేవలో వుందాము 🌺 |