శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
283. సహస్రాక్షీ | ||
అనంతమైన కన్నులు . కన్నులు ఎన్ని వున్నను ఆ తల్లీ చూపు మాత్రం ఒకటే. పక్షపాత వైఖరి లేనటువంటిది. ఈ సృష్టిలో మాయ చేత, కొందరు వారి చైతన్య లక్షణాలను బట్టి, సంస్కారాన్ని బట్టి, ఒక సత్యమును వివిధ రితులుగా అర్ధము చేసుకుంటారు. చెడుని మంచిగా, మంచిని చెడుగా చూస్తారు. అహంకారము చేత పలువిధములుగా వ్యాఖ్యానము చేస్తారు. ఎన్ని దృక్పదాలనుంచి చుసినా,సత్యము ఒకటే. దేవుడు ఒకటే. లలితాపరమేశ్వరి యొక్క నామము సహస్రాక్షి, ఈ విషయాన్ని సూచిస్తుంది. మన కన్నులకు సత్యాన్ని చూపించే తల్లికి నమస్కారము 🙏 🌺 దయాద్రుష్టి నాపై ప్రసరింపజేయి అని ఆ పరాశక్తిని వేడుకోవాలి.🌺 |