శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
248. పద్మరాగ సమప్రభా | ||
పద్మరాగ మణులు, అవి ఎఱుపు కాంతితో వుంటాయి. అటువంటి సమాన కాంతిని కలిగి వున్నది ఆ జగజ్జనని. మరియు ఎర్రతామర పువ్వు వంటి కాంతియూ కలిగి వున్నది. శుక్ల , రక్త మిశ్రమ కాంతియే పద్మరాగ సమప్రభా. అట్టి ఆ కాంతితో బాసిల్లు తల్లీకి నమస్కారము 🙏 🌺ఆ జగజ్జనని నీడలో, మన భవిషత్తును కాంతివంతంగా చేసుకుంటాము. మనకి లభించిన కాంతిని నలుగురితో పంచుకుంటాము. అమోఘమైన శుభ ఫలితాలను పొందుతాము.🌺 |