శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
262. తుర్యా | ||
మనోబుధి నేత్రగోళము నాశ్రయించి ఉన్నపుడు జాగ్రదవస్థ. కంఠగతమైనపుడు స్వప్నము. హృదయగతమైనపుడు గాఢసుషుప్తి. శిరస్సును, సహస్రారమధ్యమును పొందినపుడు తురీయమనబడును. జాగ్రత, స్వప్న, సుషుప్తి అవస్థలకు మించినది తుర్యావస్థ. ఆ పరాశక్తి స్థానము సహస్రారమును చేరినప్పుడు, దానిని తురీయావస్థ అంటారు. తురీయప్రాప్తియే జీవన్ముక్తి. వారు శివతుల్యులు.ఈ అవస్థ నందు జీవులకు శుద్ధ జ్ఞానము వికసించును. పరాశక్తి తురీయావస్థా స్వరూపముగా ఉన్నది గనుక ' తుర్యా'. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మన లక్ష్యమే ప్రపంచం అన్న స్థితికి రాగలుగుతాము. ఏకాగ్రత మరియు మనయందు విశ్వవాసం పెరుగుతుంది.🌺 |