శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
227. మహా మంత్రా | ||
విశేషమైన మంత్ర శక్తి. లలితా సహస్ర నామంలో ప్రతి నామము విశేషమైన మంత్రమే. అన్ని మంత్రములు ఆ తల్లీ స్వరూపాలే. ప్రతి నామము జపిస్తే, మనశారీరములో వున్న దుష్ట ప్రభావమును నశింపజేస్తుంది.. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలోని దుష్టభావలు పోయి, మనము మాట్లాడే ప్రతి మాట గౌరవప్రదముగా వుంటుంది.🌺 |