శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
264. సృష్టి కర్త్రీ | ||
ఈ సమస్త సృష్టికి కర్త. ఈశ్వర తత్వము కలిగి వున్న జగన్మాత, సకల చరాచర సృష్టికి కారణభూతురాలై వున్నది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనములన్న ఐదు కృత్యములు. ఈ పంచ కృత్యములు ఆ పరాశక్తి చేయును కాబట్టి ఆమె సృష్టి కర్త్రీ. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ధర్మ బుద్ధితో కూడిన భావాలు మనలో కలుగుతాయి. ఆ భావాలను వ్యక్త పరిచి, వాటిని క్రియగా మర్చి, సమాజానికి ఉపయోగపడేలాగా చెయ్యకలుగుతాము.🌺 |