శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
300. నామరూప వివర్జితా | ||
ఈ సృష్టి లయము లేదా మహాప్రళయము సంభావించినప్పుడు, అన్నియూ నశించినప్పుడు, నామరూపములు ఏమియూ వుండవు. ఈశ్వరుడు ఒక్కడే అంతయూ నిండి వుంటాడు. ఈశ్వర శక్తియే నామరూప వివరజితయై, పూర్ణమై వుంటుంది, బ్రహ్మము ఒక్కటే మిగిలి వుంటుంది. ఆ పరబ్రహ్మమే లలితాంబిక. నామము, రూపము లేనట్టిది. ఈ సృష్టి అధిష్టాత్రి అయిన జగతజననికి ఈ నామములు, రూపములు వర్తించవు. పరబ్రహ్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము 🙏 🌺సమాజ శ్రేయస్సు కోసము సేవ చేస్తున్నపుడు, పేరు, ప్రతిభ కొరకు పరితపించకూడదూ అన్న జ్ఞానము కలిగి,సమైక్య శక్తియే బలము అన్న సంఘీ భావన కలుగుతుంది.🌺 |