శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
286. వర్ణాశ్రమ విధాయినీ | ||
వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది. భ్రమచర్య, కౌమర్య, గృహస్థ, సన్యాస అన్న నాలుగు ఆశ్రమలకు కలిగిన ధర్మాచరణ భోదిస్తుంది. మానవుడు తమ వయస్సును, సమయమున బట్టి, ఏ ఆశ్రమున వుంటారో వాటి కర్తవ్యం నిర్వర్తించాలి. చతుర్విధ పురుషార్ధాములను తన యందు లయము చేసుకున్నట్టిది. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺వయ్యాసుకు, పరిస్థితికి, సందర్భాలకు, బాధ్యతలు మన ఆశ్రమ ధర్మాన్ని బట్టి నడవాలి అన్న వివరణ కలుగుతుంది.అన్ని ఆశ్రములయందు ఆ పరాశక్తి పాదములను వీడరాదు అన్న జ్ఞానము కలుగుతుంది 🌺 |