శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
226. మహాతంత్రా | ||
సకలతంత్రములలో తానై యున్నటిది. సకల ఫలములను ఇచ్చు తంత్రములకు మూలమైనది. తమ కోరికలను సిద్దించుకోడానికి యోగులు ఆ పరాశక్తిని తంత్ర సాధనతో ధ్యానము చేస్తారు. గొప్ప ఫలాలను ప్రసాదించే తల్లికి నమస్కారము 🙏 🌺నామ స్మరణ మాత్రంచే ఆ పరాశక్తి సర్వదా, దుష్ట ప్రభావన్నించి రక్షిస్తుంది.🌺 |