శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
204. సర్వమంత్రమయీ | ||
సకల శాస్త్రములందు గల సర్వమంత్రాముల యుక్క స్వరూపము. ఓం కార మంత్రం నుండి సమస్త మంత్రములు ఆ దేవి యుక్క స్వరూపములే. ఏ మంత్రంతోనైనా ఆ దేవుని స్తుతిస్తే, తన భక్తులకు సద్గతిని ప్రసాదిస్తుంది. సర్వ రహస్యములకు రహస్యమైన, సర్వణువులయందు తానుగా భాసించే ఏ పరాశక్తి వున్నదో ఆమెయే సర్వమంత్ర స్వరూపిణి. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺అమ్మవారి యుక్క నామ స్మరణ, జపము చెయ్యడం వల్ల, మనలో ఒక పవిత్రత భావన ఏర్పడుతుంది. తత్తద్వారా మనము మాట్లాడే ప్రతి మాట వివేకంతో, జ్ఞానం తో కూడినదవుతుంది 🌺 |