శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
218. మహారతి | ||
తల్లీ తన పిల్లల పట్ల చూపించే కరుణ, వత్సల్య భావమే మహారతి. పరతత్త్వము గురించి తెలుసుకున్నవారికి, విషయవాంచలమీద ఆసెక్తి నశించి, అమ్మ యందు మనస్సు లగ్నం అవుతుంది. జ్ఞానులను ఆకర్షించు తత్వము దేవి కలిగివున్నది కనుక మహారతి అని స్తుతింపబడుచున్నది. జ్ఞాన ప్రధాయిని అయిన ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఆ జగతజనని యుక్క తత్త్వమును తెలుసుకోవాలి అనే ఆసెక్తి కలుగుతుంది.. ఆ తల్లికి ప్రీతిప్రాత్రులం అవుతాము.🌺 |