శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
244. చారాచర జగన్నాధా | ||
ఈ సకల చారాచర జగత్తు అంతయు జగన్నాధుడు వున్నాడు. చరము అంటే కదిలేది. అచరము అంటే స్తావరము. చరము అంటే శక్తి, అచరము అంటే శివ. ప్రాణము శక్తి, ప్రాణి శివ. నామము శక్తి, రూపము శివ. పంచభుతములను ఉద్భవింపచేసే శక్తియే చరాచర జగన్నాధా. ఈ జగత్తుకు ఆదీశవరీ అయిన తల్లికి నమస్కారము 🙏 🌺ప్రతి అంశములో కనిపించే, కనిపించని, కదిలే కదలని కారణము వెనుక వుండే చైతన్యమును పరిశోధన చేసే ప్రజ్ఞానము పెరుగుతుంది.🌺 |