శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
243. చారుచంద్ర కళాధరా | ||
వృద్ధి క్ష్యములు లేని అష్టమి నాటి చంద్రకళ ను ఫాలభాగమున ధరించునది. చారు చంద్ర కళాధరా అంటే అమృత కళలన్నీ తన యందే పెట్టుకున్న షోదశి స్వరూపముగల శ్రీచక్రస్వరూపిణి లలితా పరాభట్టారిక. చంద్ర కళను ధరించిన తల్లికి నమస్కారమ🙏 🌺మన ఉద్యోగ, వ్యాపారల్లో , నిత్య జీవితంలో దినదిన అభివృద్ధిని చూస్తాము.ఆ ఆనందాన్ని పొందుతాము 🌺 |