శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
297. హరిబ్రహ్మేంద్ర సేవితా | ||
హరి చేత, బ్రహ్మ చేత, ఇంద్రాది దేవతల చేత సేవింపబడి నట్టిది. మంత్ర శాస్త్రము ప్రకారము హరి అనగా 'శ్రీం' , బ్రహ్మ 'క్లిం', ఇంద్ర 'హ్రి0' అన్న బీజ సంపుటితో జపము చేస్తే మంత్రము సిద్ధిస్తుంది. బీజాక్షర రూపమైన తల్లికి నమస్కారము 🙏 🌺తల్లీ యొక్క బీజాక్షరాలు చాలా ప్రవిత్రమైనవి. వాటిని గురు ద్వారా ఉపదేశము పొందిన తరువాతే, వాటిని జపము చేయవచ్చు. మానవుడి దేహము, మనస్సు, బుద్ధి పవిత్రముగా వుంటేనే ఆ తల్లీ బీజాక్షరాల జపించడానికి మనకి అర్హత లభిస్తుంది 🌺 |