శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
210. మహాలక్ష్మీ | ||
సర్వ సంపదలకు తానే స్వరూపిణి. మహా అనగా అనంత, పూజ్యనీయమైనది. లక్ష్మి: లో 'ఈO' కారమును శరణుపొందుచున్నాను అని అర్ధం . మహాలక్ష్మీ అంటే, అనంతమైన సంపదతో , పూజ్యనీయమైన తల్లి శరణను పొందుతున్నాను. సర్వ సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీదేవి కి నమస్కారము 🙏 🌺శక్తి, వైభవాన్ని, అనంతమైన జ్ఞానసంపదను ప్రసాదిస్తుంది.🌺 |