నాలుగు యుగములు (కృతయుగం 17లక్షల 28వేల సంవత్సరాలు, త్రేతాయుగము 12లక్షలు 66వేల సంవత్సరము, ద్వాపర యుగము 8లక్షల 64వేల సంవత్సరము, కలియుగము 4లక్షల 32వేల సంవత్సరము )కలిస్తే అది మహాయుగమని పిలవబడుతుంది.
71 మహాయుగములు ఒక మన్వంతరము. ఇట్టి 14 మన్వంతరములు ఒక కల్పము.
మనము ఇప్పుడు ప్రస్తుతం శ్వేత వరాహ కల్పములో, కలియుగములో వున్నాము.
కల్పము అంటే బ్రాహ్మకి ఒక పగలు, రాత్రి. బ్రహ్మ ఆయుష్షు వంద సంవత్సరములు. దీని ప్రకారము ఎన్ని కోట్ల యుగములు వెళ్ళిపోతాయో మనకి తెలియదు. ఇది మహాకల్పమంటే.
యుగములు, కల్పములు, మన్వంతరములు అన్నీ అయిపోయిన తరువాత మళ్లీ సృష్టి చేయటానికి మధ్యవున్న సంధ్యాసమయాన్ని సృష్టించే తాండవమేదో అదియే మహాతాండవము.
రోజు త్రిసంద్యలు ఈశ్వరుడు తాండవము చేస్తూనే వుంటాడు. అతడి తాండవము వలనే మన శరీరములో శ్వాసప్రశ్వాసలు, చలనము కలిగి వుంటాము.
ఈశ్వరుడి చివరి నృత్యం మహాకల్పతాండవము.
ఆ మహాకల్పతాండవము తరువాత సృష్టి అంతా ఈశ్వరుడి లోకి లాయమైపోతుంది.
ఇక ఏమియు వుండదు. నిరామయం, నిరాకారం, అంధకారము.
ఈ మహాకల్పతాండవానికి సాక్షిణి, క్రియా శక్తి అయిన అమ్మవారు. ఒక్క పరమేశ్వరియే ఆ మహాకల్పతాండవానికి సాక్షిణి.
అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏
🌺సంకల్పము, క్రియ, అనుభవము అన్న ఈ మూడుస్థాయిలు, మన నిత్య కర్మలో చైతన్యాన్ని ఇస్తాయి.
ఆ చైతన్య స్థానాన్ని బట్టి వచ్చే మార్పులకు, కర్మ చేయడమ వరకే మన కర్తవ్యం....
వచ్చిన ఫలమును, సాక్షి భూతులుగా చూడగలిగే తత్వం మనలో అలవడుతుంది.🌺
|