శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
225. మహాయోగేశ్వరీ | ||
మహాయోగేశ్వరి అన్న నామములో ఈశ్వర, ఈశ్వరి, మహాయోగి, యోగి అన్నవి దాగివున్నాయి. సదాశివ, మహామాయా రెండింటిని ఒక చోట కలపటమే మహాయోగం. అనగా యోగముతన అధిష్టానములో వున్న ఈశ్వరి, యోగులకు ప్రభువు అయినది. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺రకరకాల మనతత్త్వముగల వ్యక్తులతో కలిసిపోయే సమర్థత కలుగుతుంది.🌺 |