శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
238. మనువిద్యా | ||
మనువు ఉపాసించినటువంటి విద్య. మనువుతో పాటు పన్నెండు మంది ఈ దేవి ఉపాసన చేశారు. వారు, ఎవరు అనగా సూర్యడు, చంద్రుడు, అగ్ని, కుబేరుడు, అగస్తి, స్కందుడు, ఇంద్రుడు, శివుడు, లోపాముద్ర, దూర్వాసుడు, మన్మధుడు, సోముడు. ఈ మనువిద్యా, శ్రీవిద్య యొక్క స్వరూపము. మనువు అంటే మననం చేయువాడు. నిరంతరమూ అమ్మాయుక్క నామమును మననం చేయడం. మనువిద్యా స్వరూపిణియే శ్రీలలితా పరాభట్టారిక. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఈ సృష్టి మొదలు మనువు తో ప్రారంభం. ఆ మనువు నుండి మనందరమూ ఈ భూమి మీద జన్మించాము. అట్టి ఆ మనువంశం నించి వచ్చిన మనకి అమ్మ యొక్క నామము నిరంతరమూ మనలో స్మరణ జరుగుతువుండాలి. మన బాగోగులు అన్నియూ ఆ తల్లీ చూసుకుంటుంది. అటువంటి నమ్మకం మనలో వుండాలి.🌺 |