శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
272. సదాశివా | ||
శుద్ధ సత్వ స్వరూపము. పరమాత్మతో అవిభాజ్యమైన శక్తిని సదాశివా అందురు. అంతర్గత శక్తి, బహిర్గతమైనపుడు, ఆ ఇచ్చా సాఫల్యమే సదాశివ. అతి పవిత్ర మైన శక్తి. సదా అనగా ఎల్లపుడు, శివా అనగా పవిత్రము.సదాశివుడే ఆదిపరాశక్తి. అటువంటి పవిత్రమైన శక్తికి నమస్కారము 🙏 🌺సదా శుభకరమైన ఆలోచనలు, భావాలను కలిగిస్తుంది.🌺 |