శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
288. పుణ్యాపుణ్యఫలప్రదా | ||
పుణ్యా (పుణ్యము ), అపుణ్యా (పాపము ) యొక్క ఫలమును ఇచ్చునది. జీవులకు వారివారి పాపపుణ్యములనుబట్టి తగిన ఫలమును ఇచ్చును జగన్మాత. జగన్నాటక సూత్ర ధారిణియైన జగన్మాత, తన లీలవిలాసముతో 84లక్షల జీవరాశులకు జీవనము ప్రసాదించి, మాయలో పరితప్తులను చేసి, చివరకు తనయందు లయము చేసుకుంటుంది. జగన్నాటక సూత్రధారియైన జగన్మాతకు నమస్కారము 🙏 🌺మనము చేసే కర్మను బట్టి తీపి ఫలమా, చేదు ఫలమా అన్నది నిర్ణయము అవుతుంది. మనము చేసే మంచి పనికి మన ధర్మ పెట్టెలో పుణ్యము అక్షయము అవుతుంది.అదేవిందంగా పాపపు పనులకు మన ఖాతా లో పాపము చేరుతుంది.ఈ జ్ఞానము మన నడవడికలో చాలా మార్పు వస్తుంది.🌺 |