శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
255. ధర్మాధర్మ వివర్జితా | ||
ధర్మము,అధర్మము రెండింటిని వీడినది. దేవి కర్మరహితురాలు కాబట్టి ధర్మా ధర్మ వివర్జితా. పుణ్యము, పాపము వంటి కర్మలు దేవికి అంటవు కాబట్టి తాను ధర్మా ధర్మ వివర్జితా. ధర్మా ధరమునకు అతీతముగా వున్న తల్లికి నమస్కారము 🙏. 🌺మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకొనడమే ధర్మము యొక్క ముఖ్య లక్షణము. ధర్మాధర్మ విచక్షణ చేసి,సత్పురుషుల సాంగత్యములో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోగలుగుతాము . ధర్మ బద్దంగా వ్యవహరించగలుగుతాము . ఇటువంటి ప్రమాణికమైన ధర్మాన్ని ఆచరించినవారు ఇహలోకాల్లో కీర్తిని, సుఖాన్ని పొందుతాము .🌺 |