శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
209. మహాదేవీ | ||
మూల ప్రకృతి రూపిణి. సర్వమునకు దేవి. ఈ సృష్టికి మూలం బిందువు. ఆ బిందువే జనని కాబట్టి మహాదేవీ. శ్రీచక్రపూర నివాసిని మహాదేవీ. మహాదేవుడికి పత్ని కాబట్టి మహాదేవీ. పూజ్యనీయమైన గొప్ప రూపము కలిగినటువంటి తల్లికి నమస్కారము 🙏 🌺జగత్తునంతటిని నడిపించే ఆ మహాదేవీ యుక్క చరణాలకు సేవ చేసుకునే భాగ్యం లభిస్తుంది.🌺 |