శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
277. భగమాలినీ | ||
భగము అనగా షద్గుణ సంపతీ కలిగి వున్నది. వాటిని మాలికగా వేసుకున్నది. షడ్గుణములు, అనగా జ్ఙానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అను ఆరు గుణములు అవధులు లేకుండ వున్నది . సమస్తమునకు ఆధారము. సర్వత్ర వ్యాపించివున్నది. భగ అన్న పేరు ,సూర్యుని యొక్క ద్వాదశాదిత్య పేర్లలో 'భగుడు' అన్న నామము ఇక్కడ సూచిస్తుంది. అనగా సూర్యుని తేజేసు వలే కాంతిశ్వరూపిణి. కాంతితో మెరుస్తున్నవి ఆ జగజ్జనని యొక్క షద్గుణముల మాలికా అని అర్ధము. 🌺 కార్యం పట్ల పట్టుదల,సమర్ధత వున్నప్పుడు,.. సమర్థతకు కావలసిన లక్షణాలు అన్ని ఒక మాలగా అల్లుకొని మనలో ప్రవేశించి, మంచి మార్గములు నడిపిస్తాయి.🌺 |