శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
273. అనుగ్రహదా | ||
అనుగ్రహము ఇచ్చునది. సదాశివునితో కూడిన ఆధిపరాశక్తి అనుగ్రహిస్తుంది. సకల లోకమునకు జగన్మాత త్రిశక్తి స్వరూపిణీ. త్రిమూర్తుల తత్వము కలిగి వున్నది. మహా ప్రళయము తరువాత మరళ సృష్టి, స్థితి, లయ కార్యములను నిర్వర్తించి జీవులను అనుగ్రహిస్తుంది. అనుగ్రహప్రదాతయైన తల్లికి నమస్కారము 🙏 🌺ధర్మ మార్గమున జీవన ప్రయాణము చేస్తున్న వారందరికీ తల్లీ అనుగ్రహము వుంటుంది.🌺 |