శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
247. పద్మనయనా | ||
పద్మముల వంటి నేత్రములు కలది. దేవియొక్క నేత్రములు సూర్యుడు, చంద్రుడు. సూర్యనేత్రములు రక్తవర్ణముగా, చంద్రనేత్రము శ్వేతవర్ణముగా వుండును. మూడవది అగ్ని నేత్రము, ఎఱుపు పసుపు కలిపి వుంటుంది. ఈ రెండు నేత్రాలు జగత్ చక్షువులు. సర్వసృష్టికి సాక్షి ఈ పద్మనయనము. పద్మముల వలే విశాలముగా వుండే నయనాలు గల తల్లికి నమస్కారము 🙏 🌺పద్మము ఎలా ఐతే సూర్యకిరణములకు విచ్చుకుంటుందో,.... మనిశి తన యొక్క ఆలోచనలు, ద్రుష్టిని ,ఆ తల్లీ సృజనాత్మక శక్తి వైపు విషయ పరిశోధన చేస్తూ, జ్ఞానాన్ని వికసింపచేసుకుంటాడు . తత్తద్వారా,... చంద్రుడి వెన్నెల వంటి అమ్మాయొక్క చల్లని చూపు మన మీద నిలుస్తుంది. ఆ చల్లని చూపు మన మీద పడటంతో, జీవిత లక్ష్యం సాధించి ధన్యులమౌతాము .🌺 |