శ్రీచక్ర అంతర త్రికోణమే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు. మధ్య వున్న బింధువు పరాశక్తి.
సృష్టి కి కారణమైన శివశక్తి స్వరూపము పంచబ్రహ్మ.
సదాశివునకు తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అని ఐదు ముఖములు వున్నవి. ఈ
ఐదు ముఖములు యొక్క సమిష్టి శక్తి స్వరూపిణి గాయత్రీ.
ఆమె బ్రమాండ జనని. అందుచేతనే గాయత్రీ మాతకు ఐదు ముఖములు కలవు.
ఈక్షిత, కామ, తప:, సంకల్ప, క్రియా శక్తులు ఐదు.,.
ఐం, హ్రిo,శ్రీం, క్లిం, సౌ: అన్నవి పంచబ్రహ్మ బీజములు.
అంట్లే జాగ్రత, స్వప్న, సుషుప్తి, తురీయ, తురియాతితములు ఐదు చైతన్య స్వరూపిణిగా ఆ జగజ్జనని ఆదేశానుసారం నడుస్తాయి.
అటులనే బాల్య, యవ్వన, కౌమార, వానప్రస్థ, సన్యాస ఆశ్రములు ఐదు. అన్నియు ఆ జగజ్జనని యొక్క స్వరూపములే.
భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగ, లయము అన్నియూ ఆ బ్రహ్మణి స్వరూపములే.
పంచబ్రహ్మలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచభూతాలు అన్నియూ ఆ పరాశక్తి రూపాలు. అన్నింటిలో వున్న ఆ తల్లికి నమస్కారము 🙏
🌺దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయము వంటి ఐదు గుణములు మన జీవన ప్రయాణములో చాలా అవసరము. ఈ గుణములు అమ్మవారికి ప్రీతిని కలిగిస్తాయి. వీటి సాధనతో ఆ తల్లి ఆశీసులను పొందుతాము.🌺
|