శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
271. ఈశ్వరీ | ||
ఈశ్వరుని తత్వము కలగి వున్నది. ఈశ్వర తత్వము అంటే, ఏది ఉలకదో, ఏది పలకదో, నీతో సంభాషించదో, నీతో ఎప్పుడూ వాదోపవాదాలు చేయదో అదే ఈశ్వర తత్వం". "చిదానంద రూపం శివోహం శివోహం ". అంతా ఆ పరమేశ్వరుడి లీల అని భగవతార్పణ చేయ్యడం.. అప్పుడు అలా అనుకున్నది ఈశ్వరుడైతే ఆ అనుకున్న భావన ఈశ్వరీ అవుతుంది. ఈ ఈశ్వరీ క్రియా శక్తిగా రూపొందినప్పుడు, మహమ్మయ అవుతుంది. మహామాయ, మాయాస్వరూపిణి తానే కాబట్టి, మాయను కూడా తన అధీనములోనే వుంచుకున్నది కాబట్టి, తనని ఈశ్వరీ అని అన్నారు. సర్వ ప్రాణులయొక్క బుద్దులయందు, ఇంద్రియముల యందు అధినాయకురాలు ఈశ్వరీ. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో చైతన్యాన్ని నిలబెట్టే శక్తి ఈశ్వరీ. మన నిత్య కర్మలో వున్నది ఈశ్వరీ. ప్రతినిత్యము మన ధర్మము పాట్టించగలుగుతున్నాము అంటేనే మనలో ఈశ్వరీ వున్నది అని, దృఢ విశ్వాసం కలిగుతుంది . 🌺 |