శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
217. మహాశక్తి | ||
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తియే మహాశక్తి. సత్త్వము బలమైతే శక్తి దాని స్పందన లక్షణము. ఈ జగత్తును సక్రముగా నడిపించు సృష్టి, స్థితి, లాయలందు తానే వ్యాపించి ఉన్నట్టు వంటిది. అనంతమైన శక్తి సామర్థ్యములు గలది. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో దాగి వున్న శక్తి సామర్ధ్యాలు, అవి అమ్మ దయతో సమాజానికి ఉపయోగ పడేటట్టు చెయ్యగలుగుతాము.🌺 |