శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
284. సహస్రపాత్ | ||
జగజ్జనని యొక్క పాదములు అనంతము. సహస్ర పాదములు కలిగివున్నది. లలితాపరమేశ్వరి యొక్క విరాటస్వరూపమును సూచిస్తుంది ఈ నామము. పాదము స్థితి, గతికి చిహ్నము. సర్వ జీవులియొక్క ముఖ్య ప్రాణ స్వరూపిణీ. పరాశక్తియొక్క పాదసేవతోనే మానవుడి స్థితిగతులు పెరుగుతాయి. అమ్మాయొక్క పాదధూళితో మనవ జీవితము చెరితార్ధమవుతుంది. అనంతముగా విస్తరించి వున్న పాదాలకు నమస్కారము 🙏 🌺పరాశక్తి యొక్క పాదసేవయే జీవికి ముక్తి మార్గము.ధర్మంగా వుంటూ,ధర్మ వ్యాప్తి చేయడమే పాదసేవ.🌺 |